2 July, 2026 | 12:26 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

Districts - Jogulamba Gadwal

article_53343858.webp
హామీలు అమలయ్యే వరకు కాంగ్రెస్‌ను నిలదీస్తాం

గద్వాల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.తన వ్యక్తిగత భద్రతను కక్షపూరితంగా తగ్గించారని ఆరోపిస్తూ తనకు ఏదైనా అపాయం జరిగితే దానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని హెచ్చరించారు.సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్‌.ఎస్‌.ప్రవీణ్ కుమార్‌తో పాటు మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.

30-06-2026

article_27336255.webp
షేక్‌పల్లిలో ఘనంగా ఏరువాక పండుగ సంబురాలు

ఎర్రవల్లి: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం షేక్‌పల్లి గ్రామంలో ఏరువాక పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పండుగ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో సుంకులమ్మ అవ్వకు బోనాలు సమర్పించారు.సాంప్రదాయ పద్ధతిలో బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్న మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏరువాక సంబురాలను విజయవంతం చేశారు....

30-06-2026

article_31082831.webp
తుమ్మిళ్ల- ఆర్డీఎస్ ఫేజ్ -2 కి మహర్దశ

గద్వాల్: ఎట్టకేలకు తుమ్మిళ్ల ఆర్డీఎస్ ఫేజ్-2 కి సంబంధించి భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో భాగంగా ఫేజ్ -2 కింద వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ నీ నింపేందుకు 567 ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మల్లమ్మ కుంట రిజర్వాయర్ సామర్థ్యం 1.02 టీఎంసీ కెపాసిటీ. ఆర్డీఎస్ కెనాల్ ద్వారా మల్లమ్మ కుంట రిజర్వాయర్ నీ నింపి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే దీనికి సంబంధించి ఈరోజు గురువారం తనగల గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

25-06-2026

article_31061814.webp
అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం

అయిజ జూన్ 23 : అయిజలోని ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి ఇది. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే రోగులు పేదలు , పిల్లలు, ముసలి వాళ్లు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్లు వైద్యం కోసం వస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేద రోగులకు ప్రాణాలు నిలిపే ఆలయం. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టిక్ ట్యాంకుల కోసం త్రవ్విన గుంతలు సుమారు రెండు నెలలు కావస్తున్న ఇంతవరకు పని పూర్తి చేయకపోవడం అధికారులు అసమర్థతనా ? లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా ? ప్రాణాలు నిలిపే ప్రభుత్వ ఆసుపత్రికె ఈ దుస్థితి ఏర్పడితే మిగతా ప్రభుత్వ ఆఫీసుల దగ్గర, రోడ్లపై నిర్మాణాత్మకమైన పనుల పరిస్థితి ఏమిటని ప్రజల ప్రశ్నిస్తున్నారు ? ఆసుపత్రికి అనుసంధానం చేస్తూ అవతల 12 పడకలుగల గదులు ఉండడంవల్ల డాక్టర్లు చూసిన పేషెంట్లు ఆ పడకల దగ్గరకు వెళ్లి సెలైన్ బాటిల్ ఎక్కించుకోవడం జరుగుతుంది.

24-06-2026

article_41830741.webp
నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం

మల్దకల్ జూన్ 24 : జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు విరాళం.తన వంతు సహాయంగా గ్రామానికి వెళ్లి గ్రామ సర్పంచుకు,కమిటీ సభ్యులకు నగదు అందజేత.ఈరోజు గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం నేతివోనిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట నిర్మాణానికి 50,000/- రూపాయలను నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు విరాళం ప్రకటించి,తనే స్వయంగా పార్టీ నాయకులతో కలిసి,గ్రామానికి వెళ్లి,గ్రామ సర్పంచుకు,ఆలయ కమిటీ సభ్యులకు నగదును అందజేశారు. అంతక ముందు,శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామి వారి ఆశీస్సులను పొందారు..

24-06-2026

article_51986640.webp
ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం

అలంపూర్: గద్వాల్ జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఇసుక రీచ్‌పై జరిగిన దాడి స్థానికంగా చర్చకు దారితీసింది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లో విధులు నిర్వహిస్తున్న సైట్ ఇంచార్జి ఎల్వీ చౌదరిపై కొందరు వ్యక్తులు సోమవారం దాడికి పాల్పడ్డారని బాధితులుఆరోపించారు.బాధితుల కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు రెండు కార్లలో ఇసుక రీచ్‌కు చేరుకుని, సైట్ ఇంచార్జిని ఇనుప రాడ్లతో బెదిరించారు.అనంతరం రీచ్‌కు సంబంధించిన రికార్డు బుక్కులు, నగదు ఉన్న బ్యాగును బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

23-06-2026